మీర్జాగూడ బస్సు ప్రమాదంపై కేంద్రమంత్రులు దిగ్భ్రాంతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-03 04:46:15  IST  )

మీర్జాగూడ బస్సు ప్రమాద మృతులకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సంతాపం తెలిపారు.

మీర్జాగూడ బస్సు ప్రమాదంపై కేంద్రమంత్రులు దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: మీర్జాగూడ బస్సు ప్రమాద మృతులకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సంతాపం తెలిపారు. "రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని మీర్జాగూడలోని హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న విషాదకరమైన రోడ్డు ప్రమాదంలో 21 మంది మరణించగా, అనేక మంది తీవ్రంగా గాయపడిన విషయం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు గురిచేసింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. బాధితులకు తక్షణ సహాయం, ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతును అందిస్తుంది."అని బండి సంజయ్ ట్వీట్ చేశారు.

"రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను." అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

కాగా.. ఈ ఘోర ప్రమాదంలో 21 మంది మరణించగా.. మృతుల్లో బస్సు, లారీ డ్రైవర్లు సహా 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, 11 నెలల చిన్నారి ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా.. వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. ఆస్పత్రిలో 24 మంది చికిత్స పొందుతుండగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Read More..

ఘోర ప్రమాదంలో 21 మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

చేవెళ్ల బస్సు ప్రమాదం.. సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఆర్టీసీ బస్సు ప్రమాదంపై తెలంగాణ మంత్రులు దిగ్భ్రాంతి

Next Story