చేవెళ్ల బస్సు ప్రమాదం.. సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-03 04:50:41  IST  )

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో మీర్జాగూడ వద్ద జరగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది దుర్మరణం పాలయ్యారు.

చేవెళ్ల బస్సు ప్రమాదం.. సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో మీర్జాగూడ వద్ద జరగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. అయితే, జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం సీఎం ఘటనా స్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌‌‌‌తో పాటు, సీఎస్ రామకృష్ణా రావు, డీజీపీ శివధర్‌రెడ్డికి హుటాహుటిన ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని జిల్లా అధికారులకు సూచించారు. తాజాగా, చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై సెక్రటేరియట్‌లో ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ప్రమాద వివరాలను బాధిత కుటుంబాలకు తెలియజేసేందుకు, అధికారులతో కో-ఆర్డినేషన్‌కు AS: 9912919545, SO: 9440854433 నంబర్లకు సంప్రదించాలని కంట్రోల్ రూమ్ సిబ్బంది కోరారు.

Next Story