ఘోర ప్రమాదంలో 21 మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

by Malleboina Mahesh |   (  Updated:2025-11-03 05:00:43  IST  )

రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం.. మిర్జా గుడా వద్ద జరిగిన భారీ ప్రమాదం తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది.

ఘోర ప్రమాదంలో 21 మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: : రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం.. మిర్జా గుడా వద్ద జరిగిన భారీ ప్రమాదం తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ రోజు తెల్లవారుజామన తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ బలంగా డీకొట్టి.. బస్సు పైనే బోల్తా కొట్టింది. దీంతో బస్సులో ఉన్న 21 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు.

Read More..

ఆర్టీసీ బస్సు ప్రమాదంపై తెలంగాణ మంత్రులు దిగ్భ్రాంతి

Mirjaguda accident: మీర్జాగూడ ప్రమాదంలో గుండెలు పగిలే దృశ్యం

చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో అరణ్య రోదన.. బస్సు ప్రమాదంలో 21కి చేరిన మృతుల సంఖ్య

Next Story