- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యమకారులపై గన్ తీసినోళ్లు సీఎంలు అయిండ్రు.. ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్
తెలంగాణ జాగృతి సంస్థను 18 ఏళ్ల క్రితం స్థాపించామని, ప్రతి ఉద్యమంలో జాగృతి భాగస్వామిగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి సంస్థను 18 ఏళ్ల క్రితం స్థాపించామని, ప్రతి ఉద్యమంలో జాగృతి భాగస్వామిగా ఉందని ఎమ్మెల్సీ కవిత (Kavitha) అన్నారు. ఇవాళ బంజారాహిల్స్ (Banjara Hills)లో తన ఇంటి సమీపంలోనే జాగృతి కొత్త కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం కవిత జై తెలంగాణ, జై జాగృతి అంటూ నినాదాలు చేసి మీడియాతో ఆమె మాట్లాడారు. తెలంగాణ గొంతుకలా.. తలలో నాలుకలా జాగృతి నిలిచిందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రతి ఇంట్లో ఆడబిడ్డలానే తాను కూడా బోనం, బతుకమ్మను ఎత్తానని తెలిపారు. జాగృతి పుట్టింది ఇద్దరు వ్యక్తుల స్ఫూర్తితోనని అన్నారు. అందులో ఒకరు కేసీఆర్ అని.. రెండో వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని తెలిపారు. ఆనాడు తన సంస్థకు తెలంగాణ జాగృతి అని పేరు పెడతానంటే మేధావులు వద్దన్నారని.. ముందు తెలంగాణ అని పేరు ఉంటే తొక్కేస్తారంటూ భయపెట్టారని గుర్తు చేశారు. కానీ, ఆంధ్రా పాలకులను ఎదుర్కొని ధైర్యంగా తెలంగాణ జాగృతిని స్థాపించి వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లామని అన్నారు. ఇక నుంచి బంజారాహిల్స్ కొత్త కార్యాలయం నుంచే జాగృతి కార్యకలాపాలు ఉంటాయని అన్నారు. కేసీఆర్‌కు బీఆర్ఎస్, జాగృతి రెండు కళ్లలాంటివని అన్నారు. తాము పని చేస్తుంటే ఓర్వేలకపోతున్నారని కామెంట్ చేశారు.
ఏపీ ప్రయోజనాల కోసం పని చేస్తున్న రేవంత్..
తెలంగాణ సాంస్కృతిక రంగంలో జాగృతి ఎంతో కృషి చేసిందని అన్నారు. జాగృతి డిమాండ్లను కేసీఆర్ ఎప్పుడూ గౌరవించారని పేర్కొన్నారు. ఎప్పుడు ఏం అడిగినా వెంటనే జీవో ఇచ్చేవారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని రేవంత్ రెడ్డి ఇప్పటికైనా జై తెలంగాణ అని నినదించాలని అన్నారు. ఉద్యమకారులపై గన్ తీసుకెళ్లిన వాళ్లు రాష్ట్రానికి సీఎం అయ్యారని ఫైర్ అయ్యారు. యువ వికాసం పథకానికి రాజీవ్ గాంధీ పేరు ఎందుకు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. అసలు తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధం ఏంటని.. ఆ పథకానికి అమరవీరుల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. అవతరణ దినోత్సవం నాడు అమరవీరులకు నివాళులర్పించాలని కనీసం జ్ఞానం లేని వారికి ఆ సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదని మండిపడ్డారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీళ్లను బాజాప్తా తరలించుకుపోతుంటే సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కనీసం మాట్లాడటం లేదని ఆరోపించారు. బనకచర్ల నుంచి చంద్రబాబు 200 టీఎంసీలు తరలిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఏపీ ప్రయోజనాల కోసం రేవంత్ పని చేస్తున్నారు.. ఇన్నాళ్లు బీసీ బిల్లుపై హంగామా చేసిన ఆ వ్యక్తి ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని కవిత ఆక్షేపించారు.
పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి..
స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో 45 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని.. ఆ బిల్లును పార్లమెంట్‌లో వెంటనే ప్రవేశపెట్టి ఆమోదించాలని కవిత డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రైల్‌రోకో చేపడతామని బీజేపీ నేతలను ఆమె హెచ్చరించారు. అదేవిధంగా మైనార్టీల సమస్యలపై పోరాటం చేస్తామని అన్నారు. ప్రత్యేకంగా ఎస్సీ విభాగాన్ని ఏర్పాటు చేసి దళితుల సమస్యలపై పోరాడుతామని తెలిపారు. ఎన్నికల ముందు రాష్ట్రంలోని ప్రతి మహిళలకు రూ.2,500 ఇస్తామన్న కాంగ్రెస్ ఆ హామీని విస్మరించిందని.. అది సాధించే వరకు జాగృతి పోరాడుతుందని అన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా.. పక్క రాష్ట్రం ఏపీ నీళ్లు తరలించుకుపోతుంటే మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు. గోదావరి జలాల్లో వాటాపై ప్రశ్నించని పక్షంలో.. తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుందని అన్నారు. భవిష్యత్తులో జాగృతి సంస్థను మరింత విస్తరిస్తామని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు నోటీసు ఇవ్వడంపై జూన్ 4న పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళనలు చేపతామని కవిత స్పష్టం చేశారు.
Read More : కవిత కొత్త ఆఫీసు స్టార్ట్.. భర్తతో కలిసి ప్రత్యేక పూజలు
కవిత ఇంటి ఎదుట ఆసక్తికర ఫ్లెక్సీలు.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్






