Kavitha: కవిత కొత్త ఆఫీసు స్టార్ట్.. భర్తతో కలిసి ప్రత్యేక పూజలు

by Prasad Jukanti |   (  Updated:2025-05-31 12:22:39  IST  )

తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని కవిత ప్రారంభించారు.

Kavitha: కవిత కొత్త ఆఫీసు స్టార్ట్.. భర్తతో కలిసి ప్రత్యేక పూజలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని (Jagruthi New Office) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) ప్రారంభించారు. అనంతరం భర్తతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ప్రొ.జయశంకర్, కేసీఆర్ (KCR), కవిత మినహా బీఆర్ఎస్‌కు సంబంధించిన మిగతా నేతలెవరి ఫొటోలు కనిపించకపోవడం ఆసక్తిగా మారింది. అయితే కవిత త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారని, ఆ పార్టీ జెండా పాలపిట్ట రంగులో ఉండబోతున్నదనే ప్రచారం జోరుగా వినిపిస్తున్న వేళ ఇవాళ్టి కార్యక్రమానికి ఆమె అదే రంగు చీరతో రావడం హాట్ టాపిక్‌గా మారింది. మరికాసేపట్లో కవిత మీడియాతో మాట్లాడనున్నారు.

Read More : కవిత ఇంటి ఎదుట ఆసక్తికర ఫ్లెక్సీలు..BRS ఆనవాళ్లు లేకుండా ఆమె మెడలో కండువా...సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

ఉద్యమకారులపై గన్ తీసినోళ్లు సీఎంలు అయిండ్రు.. ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్

Next Story