కవిత ఇంటి ఎదుట ఆసక్తికర ఫ్లెక్సీలు.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-31 12:23:22  IST  )

ఎమ్మెల్సీ కవిత (Kavitha).. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది.

కవిత ఇంటి ఎదుట ఆసక్తికర ఫ్లెక్సీలు.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవిత (Kavitha).. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ అవ్వడంతో సొంత పార్టీ బీఆర్ఎస్ అలజడి రేగింది. కవిత పార్టీలో ఉంటుందా.. లేక కొత్త పార్టీ పెడుతుందా? అన్న ఊహాగానాలు సోషల్ మీడియాతో పాటు రాష్ట్రమంతటా హల్‌చల్ చేస్తున్నాయి. మరోవైపు ఆమె ఆరుగురు ఎమ్మెల్యేలను తనతో తీసుకొస్తానని కాంగ్రెస్ హైకమాండ్‌తో రాయబారం చేశారని.. పార్టీ పెద్దలు ఒప్పుకున్నా.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యతిరేకించడంతో బ్రేక్ పడిందనే వార్తలు వచ్చాయి.

అయితే, ఆ విషయం కవిత దష్టికి రావడంతో పుకార్లేనని ఎమ్మెల్సీ కవిత కొట్టిపడేశారు. కాసేపట్లోనే కవిత తన ఇంటి సమీపంలో జాగృతి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా జాగృతి తరఫున కార్యాచరణను ఆమె ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌ (KCR)కు నోటీసులు ఇవ్వడంపై మహాధర్నాపై ప్రకటన చేయనున్నారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. జాగృతి (Jagruthi) నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కవిత ఇంటి ఎదుట ఆసక్తికర ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిల్లో ‘డాటర్ ఆఫ్ ఫైటర్.. విల్ నెవర్ ఫియర్.. అనే కొటేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా గులాబీ రంగు జెండాల బ్యాక్ గ్రౌండ్‌తో ఫ్లెక్సీలు వెలిశాయి. అదేవిధంగా బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కండువాలో కవిత ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఏం జరుగుతోందనే టెన్షన్ నెలకొంది. మరోవైపు జాగృతి నూతన కార్యాలయంలో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ తల్లి, బాబా సాహెబ్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలు నిలిచాయి. BRS ఆనవాళ్లు లేకుండా కేసీఆర్‌ ఫొటోతో ఒక్కటే గోడపై కనిపించింది.

Read More : కవిత కొత్త ఆఫీసు స్టార్ట్.. భర్తతో కలిసి ప్రత్యేక పూజలు

ఉద్యమకారులపై గన్ తీసినోళ్లు సీఎంలు అయిండ్రు.. ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్

Next Story