- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మే 21న TG DEECET-2026.. 15 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్ షురూ
తెలంగాణ టీజీ డీఈఈసెట్ (TG DEECET) 2026 పరీక్ష మే 21న నిర్వహించనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed), డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ (DPSE) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ డీఈఈసెట్-2026 (TG DEECET) ఆన్‌లైన్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్షలు మే 21న జరగనున్నాయని డీఈఈసెట్ కన్వీనర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లోని 60 కేంద్రాలలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
అయితే, పరీక్ష రెండు సెషన్లలో జరగనుంది. మొదటి సెషన్ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఈ ఏడాది మొత్తం 32,611 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఇందులో ఇంగ్లీష్ మీడియంకు 18,993, తెలుగు మీడియంకు 12,384, ఉర్దూ మీడియంకు 1,234 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను మే 15 నుంచి అధికారిక వెబ్‌సైట్ https://deecet.cdse.telangana.gov.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏవైనా సందేహాలుంటే పనిదినాల్లో ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు 8317567404 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.






