ప్రశాంతంగా ముగిసిన TGICET తొలిరోజు పరీక్ష..

by Kema Shiva Kumar |

తెలంగాణ టీజీ ఐసెట్ (TG ICET) 2026 మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

ప్రశాంతంగా ముగిసిన TGICET తొలిరోజు పరీక్ష..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఐసెట్- 2026 మొదటి రోజు పరీక్షలు ఇవాళ ప్రశాంతంగా ముగిశాయి. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మొత్తం 66 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. తొలిరోజు రెండు సెషన్లలో కలిపి నిర్వహించిన మొదటి సెషన్ కు 18,783 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 16,965 మంది (90.3 శాతం) పరీక్షకు హాజరయ్యారు. 1,818 మంది గైర్హాజరయ్యారు. రెండవ సెషన్ 18,712 మంది నమోదు చేసుకోగా, 17,122 మంది (91.5 శాతం) హాజరయ్యారు. 1,590 మంది గైర్హాజరయ్యారు.

Next Story