- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణకు వార్షిక నివేదిక తప్పనిసరి
వచ్చే విద్యా సంవత్సరం (2026-27) ఎంబీబీఎస్ సీట్ల రెన్యువల్ ప్రక్రియ కోసం ఇప్పటికే అనుమతి పొందిన అన్ని మెడికల్ కాలేజీలు తప్పనిసరిగా వార్షిక నివేదిక (యానువల్ డిస్క్లోజర్ రిపోర్ట్) సమర్పించాలని NMC ఆదేశించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే విద్యా సంవత్సరం (2026-27) ఎంబీబీఎస్ సీట్ల రెన్యువల్ ప్రక్రియ కోసం ఇప్పటికే అనుమతి పొందిన అన్ని మెడికల్ కాలేజీలు తప్పనిసరిగా వార్షిక నివేదిక (యానువల్ డిస్క్లోజర్ రిపోర్ట్) సమర్పించాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంఏసీ) ఆదేశించింది. ఈ మేరకు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (యూజీఎంఈబీ) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాలేజీలు తమ నివేదికలను ఆన్‌లైన్ పోర్టల్‌లో సమర్పించడానికి ఈ నెలాఖరు చివరి తేదీ అని ఎట్టి పరిస్థితుల్లో గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. దరఖాస్తుతో పాటు రూ. 3,54,000 (18 శాతం జీఎస్టీతో కలిపి) ఫీజును కేవలం పోర్టల్ ద్వారానే ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.
మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్, 2023 (ఎంఎస్ఎంఈఆర్-2023) ప్రకారం ఈ డేటాను సమర్పించడం తప్పనిసరి. ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్) నమోదు చేసుకోని కాలేజీలకు ఎన్ఎంసీ పోర్టల్ యాక్సెస్ లభించదు. అలాగే ఒకసారి నివేదిక సమర్పించిన తర్వాత సవరణలకు అవకాశం ఉండదు. కాలేజీల నోడల్ అధికారులకు ఇప్పటికే యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లు పంపినట్లు కమిషన్ వెల్లడించింది.






