- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, ప్రభుత్వకార్యదర్శి యోగితా రాణా ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. ఇంటర్ మొదటి, రెండో ఏడాది పరీక్షల్లో 66.20 శాతం మంది పాసైనట్లు ఆయన వెల్లడించారు. 4 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిలైనట్లు తెలిపారు. పరీక్షల్లో పాసవ్వని విద్యార్థులు తొందరపాటుతో ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని ఈ సందర్భంగా కేకే విజ్ఞప్తి చేశారు.
ఇక ఫస్టియర్ లో 3,23,807 (66.20) మంది విద్యార్థులు, సెకండియర్లో 3,58,490 (70%) మంది విద్యార్థులు పాసైనట్లు కేకే వివరించారు. ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికల హవానే కనిపించింది. 74.4 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులు అవ్వగా.. 57.69 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారన్నారు. జిల్లాల వారిగా ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లానుంచి అత్యధిక విద్యార్థులు పాసవ్వగా, సెకండియర్ ఫలితాల్లో భూపాలపల్లి జిల్లా విద్యార్థులు తమ ప్రతిభ చూపారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18 వరకూ ఇంటర్ పరీక్షలు జరగ్గా.. రాష్ట్రంలో తొమ్మిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్లు https://tgbie.cgg.gov.in, https://results.cgg.gov.in లలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. లేదా వాట్సప్ ద్వారా కూడా ఇంటర్ ఫలితాలను డౌన్ లోడ్ చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. వాట్సప్ లో 80969 58096 నంబర్ కు Hi అని మెసేజ్ చేసి.. "BIE Exam Result" అని టైప్ చేసి సెండ్ చేస్తే మీ రిజల్ట్స్ వాట్సప్ కు వస్తాయి.
పన్నెండేళ్లలో ఎప్పుడూలేని రీతిలో..
కాగా.. 2014 నుంచి 2025 వరకూ.. ఎన్నడూ లేని రీతిలో.. ఈసారి పరీక్షలు పూర్తయిన నెలరోజుల్లోపే.. రికార్డు సమయంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. 2014లో మే 3న, 2015, 2016 సంవత్సరాల్లో ఏప్రిల్ 22న, 2017లో ఏప్రిల్ 16న, 2018లో ఏప్రిల్ 13న, 2019లో ఏప్రిల్ 18న, 2020లో జూన్ 18న (కరోనా పాస్), 2021లో జూన్ 28న (కరోనా పాస్), 2022లో జూన్ 28న, 2023లో మే 9న, 2024లో ఏప్రిల్ 24న, 2025లో ఏప్రిల్ 22న ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు.






