మరికొద్ది గంటల్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు

by Muthe.Rajitha |   (  Updated:2026-04-12 08:04:33  IST  )

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలు ఈరోజు ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదల కానున్నాయి.

మరికొద్ది గంటల్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు నేడు తెరపడనుంది. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలు ఈరోజు ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదల కానున్నాయి. సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు రాసిన ఈ పరీక్షల ఫలితాలను, నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేయనున్నారు. మార్చి 13న పరీక్షలు ముగిసిన నెల రోజుల వ్యవధిలోనే బోర్డు ఫలితాలను ప్రకటించడం విశేషం. కాగా విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ www.tgbie.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

అంతేకాదు ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. శనివారం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఈ సర్వీసును ప్రారంభించారు. స్మార్ట్‌ఫోన్ నుండి 8096958096 నంబర్‌కు వాట్సాప్‌లో 'bie' అని మెసేజ్ పంపాలి. తదుపరి దశలో వచ్చే సూచనల మేరకు మీ రోల్ నంబర్, సంవత్సరం, గ్రూప్ వివరాలను నమోదు చేస్తే, ఫలితాలు నేరుగా వాట్సాప్‌లో అందుతాయి.

BREAKING: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

Next Story