- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. రేపట్నుంచి ఏప్రిల్ 20 వరకూ రీ వెరిఫికేషన్, సప్లి ఫీజులకు గడువు ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు, పాసైన వారిలో మార్కుల కోసం రేపట్నుంచి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీ వరకూ అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేశారు. సప్లిమెంటరీకి కూడా ఏప్రిల్ 20వ తేదీలోగా ఫీజులు చెల్లించాలని తెలిపారు. మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, రెండు సెషన్స్ లో పరీక్షలుంటాయని వివరించారు. ఇక మే 22 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయన్నారు.
గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరిగిందని బోర్డు పేర్కొంది. 2025 ఇంటర్ ఫస్టియర్లో 66.91 శాతం మంది విద్యార్థులు పాసైతే.. 2026లో ఫస్టియర్లో 66.94 శాతం మంది విద్యార్థులు పాసయ్యారని తెలిపింది. అలాగే.. 2025 ఇంటర్ సెకండియర్లో 72.43 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 2026 సెకండియర్లో 75.61 శాతం పాసైనట్లు తెలిపారు.






