- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది బండి సంజయ్ ఫ్యామిలీ మ్యాటర్.. పార్టీకి సంబంధం లేదు: బీజేపీ స్టేట్ చీఫ్
బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన కేసు వ్యవహారంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన కేసు వ్యవహారంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పందించారు. ఈ వివాదంతో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన రాంచందర్ రావు, బండి భగీరథ్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. అసలేం జరిగిందనే అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ వివాదాన్ని రాజకీయంగా వాడుకోవడాన్ని రాంచందర్ రావు ఖండించారు. "ఇది కేవలం బండి సంజయ్ వ్యక్తిగత కుటుంబ వ్యవహారం. దీనికి పార్టీతో ముడిపెట్టడం సరికాదు," అని ఆయన అన్నారు.
విచారణ జరగాలి..
బండి సంజయ్ కుటుంబీకుల జోక్యం ఏమైనా ఉంటే, దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిజానిజాలను బయటపెట్టాలని రాంచందర్ రావు సూచించారు. రాజకీయ విమర్శలకు తావులేకుండా, వ్యవస్థలు తమ బాధ్యతను నిర్వర్తించాలని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే విచారణకు ఆదేశించిన నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.






