- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉల్లంఘిస్తే ఊరుకోం: ఏపీ సీపీఎం హెచ్చరిక
అల్లూరి జిల్లాలో ప్రభుత్వం చేపట్టబోయే బాక్సైట్ తవ్వకాలకు రాష్ట్ర సీపీఎం వ్యతిరేకించింది. ఈ మేరకు జీవీ వీధి మండలం అసంపల్లిలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసింది. ...

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి జిల్లాలో ప్రభుత్వం చేపట్టబోయే బాక్సైట్ తవ్వకాలకు రాష్ట్ర సీపీఎం వ్యతిరేకించింది. ఈ మేరకు జీవీ వీధి మండలం అసంపల్లిలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో స్థానిక సీపీఎం నేతలతో పాటు ప్రజలు సైతం పాల్గొన్నారు. అనుమతులు లేకుండా బాక్సైట్ తవ్వకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సర్వే చేపడుతోందని సీపీఎం నేతలు ఆరోపించారు. వెంటనే సర్వేను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దని సూచించారు.
జిల్లాలో భారీగా బాక్సైట్ నిక్షేపాలు
కాగా అల్లూరి జిల్లాలో బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయి. మొత్తం నాలుగు కీలక బ్లాకుల్లో భారీగా ఉన్న బాక్సైట్ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు బాక్సైట్ తవ్వకాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే స్థానిక గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. తమ మనుగడ కోల్పోతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు వ్యక్తులు సర్వే చేపట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గిరిజనులకు సీపీఎం మద్దతు తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటామని సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు హెచ్చరించారు.






