మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..

by Taduka Kalyani |

గంజాయి,ఇతర మాదక ద్రవ్యాలకు యువత పూర్తిగా దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..
X

దిశ, ఆదిలాబాద్ : గంజాయి,ఇతర మాదక ద్రవ్యాలకు యువత పూర్తిగా దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని రీజోనెన్స్ పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను పెంపొందించుకోవాలని అన్నారు. మాదక ద్రవ్యాల విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, మావల సీఐ బి.డి. ప్రేమ్ కుమార్, స్కూల్ ప్రిన్సిపల్ ప్రమోద్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story