- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్
ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. శనివారం నీటి పారుదల, మిషన్ భగీరథ, వ్యవసాయ, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్వల్పకాలిక పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ఫామ్‌పాండ్లు, బోర్‌వెల్ రీచార్జ్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే నిర్వహిస్తూ సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా నీటి పారుదల మధుకర్, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, నీటి పారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి..
జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. శనివారం గృహనిర్మాణ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి నిర్మాణాల పురోగతి, రెండో దశ మంజూర్లపై సమీక్షించారు. నిర్మాణాల్లో జాప్యం లేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని, లబ్ధిదారుల సమస్యలు వెంటనే పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. అలాగే రెండో దశలో నిర్మాణానికి ఆసక్తి ఉన్న అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా ఇళ్లను మంజూరు చేయాలని ఆదేశించారు.






