- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాన్వీ కపూర్ తమిళ ఎంట్రీ ఫిక్స్!
బీటౌన్ బ్యూటీ జాన్వీకపూర్ ఇప్పటికే..‘దేవర’, ‘పెద్ది’ చిత్రాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: బీటౌన్ బ్యూటీ జాన్వీకపూర్ ఇప్పటికే..‘దేవర’, ‘పెద్ది’ చిత్రాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండు సినిమాల్లోని జాన్వీ పాత్ర గ్లామర్‌కే అంకితం కావడంతో ఫ్యాన్స్ నిరుత్సాహం చెందారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ అమ్మడు కోలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ఈ మేరకు వెబ్‌సిరీస్‌తో జాన్వీ తమిళం ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ‘కురథి’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ వెబ్‌సిరీస్‌కు తమిళ టాప్ డైరెక్టర్ పా రంజిత్ నిర్మించబోతుండగా.. సర్కునమ్ దర్శకత్వం వహించనున్నారని ఇప్పటికే వార్తలు రాగా దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా కురథి వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ తమిళ ఒరిజినల్ సిరీస్ నిర్మాణాన్ని ప్రారంభించడానికి నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైందని సమాచారం. దీందో త్వరలోనే వెబ్‌సరీస్‌పై అఫీషియల్ అప్డేట్ రావడంతో పాటు షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నారట మేకర్స్.






