- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో పెద్ద హీరోల షూటింగులు.. అంబికా కృష్ణ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ జరగాలంటే పెద్ద హీరోలందరూ తమ సినిమాల షూటింగ్‌లను ఇక్కడే నిర్వహించాలని సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ జరగాలంటే పెద్ద హీరోలందరూ తమ సినిమాల షూటింగ్‌లను ఇక్కడే నిర్వహించాలని సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ అన్నారు. ప్రతి స్టార్ హీరో తమ చిత్రానికి కనీసం రెండు షెడ్యూళ్లనైనా రాష్ట్రంలోనే చిత్రీకరించాలని ఆయన తెలిపారు. తద్వారా లైట్ బాయ్స్, జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులతో పాటు రవాణా, హోటల్, క్యాటరింగ్ రంగాల్లో స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంబికా కృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా నటుడు నందమూరి బాలకృష్ణ ఇప్పటికే తొలి అడుగు వేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో సముద్ర తీరాలు, అడవులు, నదీ తీరాల వంటి అద్భుతమైన లొకేషన్లకు కొరత లేదని అంబికా కృష్ణ పేర్కొన్నారు.
ప్రత్యేక చొరవ చూపాలి...
నంది అవార్డుల నిర్వహణపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని అంబికా కృష్ణ కోరారు. ప్రస్తుత సినిమాల్లో ఆంధ్ర ప్రాంత భాష, యాస క్రమంగా కనుమరుగవుతుండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినీ దర్శకులు, రచయితలు స్థానిక సంస్కృతికి, యాసకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో షూటింగ్‌ల సంఖ్య పెరిగితే స్థానిక భాషా సంస్కృతులకు మరింత గుర్తింపు లభిస్తుందన్నారు. సినిమా రంగంపై ఆధారపడిన వేలాది మందికి మేలు జరుగుతుందని అంబికా కృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.






