- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్‌స్టేషన్లు ఉన్నది ఎందుకు..గుంటూరు ఘటనపై జగన్ ఆగ్రహం
గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన ఘటనపై మాజీ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. మహిళపై టీడీపీ నాయకుడు దాడికి పాల్పడ్డాడని జగన్ ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన ఘటనపై మాజీ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. మహిళపై టీడీపీ నాయకుడు దాడికి పాల్పడ్డాడని జగన్ ఆరోపించారు. ఇది మానవత్వానికి మచ్చ మాత్రమే కాదని, రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం అని పేర్కొన్నారు. ఘటన బుధవారం జరిగితే మూడు రోజుల పాటు దాన్ని కప్పిపెట్టినా, చివరకు ఆ వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చిందన్నారు.
ఈ పరిపాలనను ప్రజలు అసహ్యించుకున్న తరవాత, ఇప్పుడు చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నట్టు హడావుడి చేయడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. వీడియోలు కప్పిపుచ్చేదానిపై శ్రద్ధచూపే బదులు దాడి జరిగిన వెంటనే మహిళ ఫిర్యాదు చేసినప్పుడు స్పందించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. రాష్ట్రంలో పోలీస్‌స్టేషన్లు ఉన్నది ఎందుకు? అని ప్రశ్నించారు. బాధితురాలికి అండగా నిలబడకుండా పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తారా అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇదేనా చంద్రబాబు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన అంటూ ప్రశ్నించారు.






