బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం.. సీఎం ఆదేశాలతో SIT ఏర్పాటు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-11 08:46:59  IST  )

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిట్ (SIT) ఏర్పాటు చేసింది.

బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం.. సీఎం ఆదేశాలతో SIT ఏర్పాటు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసులో విచారణ వేగవంతమైంది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా స్పందించడంతో, ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ఆదేశాల మేరకు డీజీపీ సీవీ ఆనంద్ ఈ ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ విచారణ అంతా ఓ మహిళా ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో జరగనుంది. బాధితురాలి ప్రయోజనాలను కాపాడటంతో పాటు కేసులో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీసులు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు.

మరోవైపు బండి భగీరథ్‌ తనపై పథకం ప్రకారం ‘హనీట్రాప్’ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, పోక్సో కేసులో ఆరోపణలు, అలాగే హనీట్రాప్ ఫిర్యాదు.. ఈ రెండింటిపై సిట్ లోతుగా విచారణ చేపట్టనుంది. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కేసులో సిట్ ఎలాంటి ఆధారాలు సేకరిస్తుంది, తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

బండి భగీరథ్ వ్యవహారంపై CM రేవంత్ సీరియస్.. తక్షణ విచారణకు ఆదేశం

Next Story