బండి భగీరత్ కేసుపై సైబరాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-11 10:35:22  IST  )

బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసుపై సైబరాబాద్ సీపీ ర‌మేష్ రెడ్డి స్పందించారు. భగీరత్ పై ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేశామని అన్నారు.

బండి భగీరత్ కేసుపై సైబరాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసుపై సైబరాబాద్ సీపీ ర‌మేష్ రెడ్డి స్పందించారు. భగీరత్ పై ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేశామని అన్నారు. ప్రత్యేక టీమ్ తో కేసు విచారణ జరుపుతున్నామని చెప్పారు. కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో విచార‌ణ జ‌రుగుతోంద‌ని అన్నారు. కేసు విచార‌ణ పార‌ద్శ‌కంగా జ‌రుపుతామ‌ని హామీ ఇచ్చారు. ఎలాంటి రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు లొంగ‌కుండా విచార‌ణ జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉంటే భ‌గీర‌త్ త‌న కూతురిపై అత్యాచారం చేశాడంటూ ఓ మైన‌ర్ బాలిక త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఫామ్ హౌస్, ఇత‌ర ప్రాంతాల‌కు తీసుకువెళ్లి మ‌ద్యం తాగించి ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్టు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఇప్ప‌టికే అత‌డిపై పోక్సో కేసు న‌మోదైంది. మ‌రోవైపు బాలిక త‌ల్లి త‌న‌ను హనీట్రాప్ చేసింద‌ని భ‌గీర‌త్ క‌రీంన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశాడు. ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే సీఎం రేవంత్ సైత స్పందించారు. పూర్తి విచార‌ణ జ‌రిపి బాధితురాలికి న్యాయం చేయాల‌ని డీజీపీని ఆదేశించారు. దీంతో ఈ కేసును విచారించేందుకు సిట్ ఏర్పాటు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

అది బండి సంజయ్ ఫ్యామిలీ మ్యాటర్.. పార్టీకి సంబంధం లేదు: బీజేపీ స్టేట్ చీఫ్

Next Story