Breaking: మరికాసేపట్లో కవిత‌కు షోకాజ్ నోటీసులు..?

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-29 07:45:39  IST  )

ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీలోని నేతలపై విమర్శలు చేసినందుకు, అంతర్గత వ్యవహారాల గుర్తించి మాట్లాడినందుకు మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ ఆమెకు షోకాజ్ నోటీసులు ఇవ్వబోతున్నట్టు సమాచారం అందుతోంది.

Breaking: మరికాసేపట్లో కవిత‌కు షోకాజ్ నోటీసులు..?
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీలోని నేతలపై విమర్శలు చేసినందుకు, అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడినందుకు మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ ఆమెకు షోకాజ్ నోటీసులు ఇవ్వబోతున్నట్టు సమాచారం అందుతోంది. కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ అవ్వడం, ఆమెపై సోషల్ మీడియాలో దాడి జరగడంతో కవిత మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ చిట్ చాట్‌లో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

తాను తన తండ్రికి ఎన్నిసార్లైనా లేఖలు రాస్తానని అడగడానికి మీరెవరు అంటూ కేటీఆర్‌‌పై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన లేఖను ఎవరు లీక్ చేశారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తనకు కేసీఆర్ ఒక్కరే బాస్ అని స్పష్టం చేశారు. తనపై జైలుకు వెళ్లిన నాటి నుండి కుట్ర జరుగుతోందని అన్నారు. తనపై తప్పుడు వార్తలు వస్తే బీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. పార్టీ వాళ్లే సోషల్ మీడియాలో తనపై టార్గెట్ చేశారని ఆరోపించారు. వీటితో పాటూ కవిత మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు బీఆర్ఎస్ షోకాజులు ఇవ్వనుంది అనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ షోకాజు నోటీసులు ఇస్తే కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

కల్వకుంట్ల కుటుంబంలో యుద్ధం మొదలైంది.. ఎమ్మెల్యే యెన్నం కీలక వ్యాఖ్యలు

కేసీఆర్‌ను నడిపించేంత పెద్దోళ్లా మీరు.. కేటీఆర్‌పై కవిత పరోక్ష వ్యాఖ్యలు

దేవుడిపైనే దండెత్తుతావా? క‌విత‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫైర్

Next Story