- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‌ను నడిపించేంత పెద్దోళ్లా మీరు.. కేటీఆర్‌పై కవిత పరోక్ష వ్యాఖ్యలు
రాష్ట్రంలో కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత జోరు పెంచారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత జోరు పెంచారు. బీఆర్ఎస్‌లోని అగ్రనేతలే టార్గెట్‌గా ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవాళ కవిత మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. దేశం బయట సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు పెట్టుకుని తనపై కొందరు కుట్రలు చేస్తున్నారు ఆరోపించారు. ఆ తెలివితేటలు ప్రతిపక్షాలపై చూపించాలని.. తనపై కాదని హితవు పలికారు. తనకు నీతులు చెబుతున్న వాళ్లంతా రాష్ట్రంలో నీళ్ల వివాదంపై మాట్లాడితే బాగుంటుందని ధ్వజమెత్తారు. ట్విట్టర్‌లో ట్వీట్లు చేస్తే సరిపోదని.. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏం రాదని.. తాను అసలే మంచిదాన్ని కాదని.. నోరువిప్పితే తట్టుకోలేరని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్‌ను కొందరు తామే నడిపిస్తున్నామంటూ ఫోజులు కొడుతున్నారని.. కేసీఆర్‌ను నడిపించేంత పెద్దోళ్లా మీరు అంటూ కవిత ఫైర్ అయ్యారు.
అలాంటి చిచ్చొర రాజకీయాలు చేయను..
ఇక సొంత పార్టీ సోషల్ మీడియానే తనను టార్గెట్ చేసిందని.. తప్పుడు వార్తలు రాస్తే పార్టీ ఎందుకు ఖండిచడం లేదని ప్రశ్నించారు. తన డిమాండ్ ఒక్కటేనని.. తాను తన తండ్రికి రాసిన లేఖను ఎవరు లీక్ చేశారో చెప్పి తీరాలన్నారు. కేసీఆర్‌కు నోటీసులిస్తే ఎందుకు నిరసనలు చేయడం లేదని అన్నారు. అదే మరో నేతకు నోటీసులు అందితే అప్పటికప్పుడు హంగామా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వాళ్లలాగా చొచ్చొర రాజకీయాలు చేయనని.. హుందాగా ఉండే వ్యక్తినని అన్నారు. నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో వెన్నంటే ఉండి సొంత పార్టీ నాయకులు తనను ఓడించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జైళ్లో ఉన్నప్పుడే కుట్రలు..
తాను జైల్లో ఉండగానే పార్టీని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరిగిందని.. అదే ప్రతిపాదనను తన వద్దకు తీసుకువస్తే విలీనం వద్దని చెప్పానని అన్నారు. అదేవిధంగా లిక్కర్ స్కామ్‌లో జైలుకు వెళ్లేముందు పార్టీకి రాజీనామా చేస్తా అని అన్నానని, కానీ కేసీఆర్ వద్దని వారించారని గుర్తు చేశారు. తాను రాసిన లేఖను లీక్ చేసిన వారిని పట్టుకొమ్మంటే.. గ్రీకువీరులు దండెత్తారని కామెంట్ చేశారు. పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరపున తాను చేస్తున్నానని అన్నారు. పార్టీలో కోవర్టులు ఉన్నారని చెప్పినా.. ఎందుకు పక్కన పెట్టడం లేదని పార్టీ అధినాయకత్వాన్ని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని.. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓ మునిగిపోయే నావ అని ఆ పార్టీతో రాయబారాలు జరిపే అవసరం తనకు లేదన్నారు. తనకు, కేసీఆర్‌కు మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందని అన్నారు. తాను ప్రత్యక్షంగా పార్టీకి దూరమైతే ఎవరికి లాభమో.. అందరికీ తెలుసని, కావాలనే తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని కవిత ఆరోపించారు.
మరికాసేపట్లో కవితకు షోకాజ్ నోటీసులు..?
కల్వకుంట్ల కుటుంబంలో యుద్ధం మొదలైంది.. ఎమ్మెల్యే యెన్నం కీలక వ్యాఖ్యలు






