కల్వకుంట్ల కుటుంబంలో యుద్ధం మొదలైంది.. ఎమ్మెల్యే యెన్నం కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-29 07:15:31  IST  )

బీఆర్ఎస్‌ (BRS)లో కేటీఆర్, ఇతర నేతలను ఉద్దేశించి తాజాగా ఎమ్మెల్సీ కవిత (Kavitha) చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్‌ను పుట్టిస్తున్నాయి.

కల్వకుంట్ల కుటుంబంలో యుద్ధం మొదలైంది.. ఎమ్మెల్యే యెన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌ (BRS)లో కేటీఆర్, ఇతర నేతలను ఉద్దేశించి తాజాగా ఎమ్మెల్సీ కవిత (Kavitha) చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్‌ను పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని బీజేపీ (BJP)లో విలీనం చేసే కుట్ర జరుగుతోందని.. కేటీఆర్‌ నుంచి తనను దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోసం వాటాల పంపకాల కోసం కల్వకుంట్ల కుటుంబంలో ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటూ యుద్ధం మొదలు పెట్టారని సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రజలకు కూడా కొత్త సినిమాను చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

పార్టీ నడపడంతో పాటు పరిపాలనలో కేటీఆర్ (KTR) అనర్హుడని సొంత చెల్లి కవితే చెబుతుందని అన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏమి మిగలేదని అన్నారు. మరోవైపు కేసీఆర్‌కు బయటకు రావాలంటే అహం అడ్డొస్తుందని కామెంట్ చేశారు. కేవలం అధికారం కోసమే కేసీఆర్, కేటీఆర్‌ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడు ప్రజల పక్షాన నిలిచి పోయాడాల్సింది పోయి ఫామ్‌హౌజ్‌కే పరిమితం అవుతోన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కల్ల అని.. పార్టీ భూస్థాపితం అవుతుందని పేర్కొన్నారు. కేవలం అధికారం కోసమే రాజకీయాలు చేయడం మానెయ్యాలని కేసీఆర్‌కు హితవు పలికారు. కల్వకుంట్ల కుటుంబం ఉద్యమకారుల గొంతు కోసిందని.. వాళ్ల ఉసురు తగిలి కవిత కకావికలమవుతోందిని యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Next Story