Komali: తిరిగి వస్తే వదిలేయాలని తెలుసు.. కోమలి సూసైడ్ నోట్‌‍లో సంచలన విషయాలు

by Prasad Jukanti |   (  Updated:2026-02-26 05:23:56  IST  )

యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఈ కేసులో కోమలి సూసైడ్ నోట్ లో కీలక అంశాలు వెలుగు చూశాయి.

Komali: తిరిగి వస్తే వదిలేయాలని తెలుసు.. కోమలి సూసైడ్ నోట్‌‍లో సంచలన విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: యూట్యూబర్ కోమలి (YouTuber Komali) ఆత్మహత్య కేసు తీవ్ర విషాదం నింపింది. పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాల్సిన తమ బిడ్డ ఇలా అర్థాంతరంగా తనువుచాలించడం పట్ల కోమలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే కోమలి సూసైడ్ వెనుక ప్రేమ వ్యవహారమే కారణం అని ఆమె గదిలో లభించిన సూసైడ్ లేఖను (Komali Suicide Note) బట్టి తెలుస్తోంది. తాజాగా ఆమె గదిలో నుంచి పోలీసులు సూసైడ్ నోట్‍ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులోని అంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ప్రేమ, వేదన, ఎదురు చూపులతో కుమిలిపోయిన కోమలి చివరకు ఈ డేంజర్ డిసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

అతడిని వదిలేయాలని నాకు తెలుసు:

కోమలి రాసినట్లు పేర్కొంటున్న సూసైడ్ నోట్‍లో కీలక అంశాలను కోమలి పేర్కొంది. 'నేను ముందుకు సాగడానికి భయపడుతున్నాను.. ఎందుకంటే అతను తిరిగి వస్తే? వదిలేయాలి అని నాకు తెలుసు. అతను నా వాడు కాదు అని తెలుసు. అతను నాతో ఉండటానికి కూడా ప్రయత్నించడం లేదని తెలుసు. కానీ నా లోపల చిన్న భాగం ఇంకా ఎదురుచూస్తోంది. ఇంకా ఆశిస్తోంది. ఒక రోజు అతను నన్నే ఎంచుకుంటాడని నా మనసు ఊహిస్తోంది. అందుకే ముందుకు సాగడం అసాధ్యం అనిపిస్తోంది. నేను చివరికి దూరంగా నడిచి వెళ్తే, అదే క్షణంలో అతను తిరిగి వచ్చేస్తాడేమోనని…' అంటూ తన ప్రియుడి కోసం పడిన వేదనను రాసుకొచ్చింది.

ఆరు నెలల క్రితమే ఆత్మహత్య యత్నం!:

మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటున్న కోమలి మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతోంది. ఈ క్రమంలో కోమలి అఖిల్ రెడ్డి అనే యువకుడిని ప్రేమించింది. కోమలి నుంచి దూరంగా ఉండేందుకు అఖిల్‌ రెడ్డి ప్రయత్నిస్తుండటంతో ఆరు నెలల క్రితం ఆమె ఆత్మహత్యకు యత్నించగా బంధువులు సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈఘటనపై కోమలి తల్లి స్పందిస్తూ అఖిల్‌రెడ్డి తన కూతురి విషయంలో మోసం చేశాడని ఆరోపించింది. తమ వద్ద కోమలి ఇష్టం లేదంటూనే మరో వైపు తన కూతురితో మాట్లాడుతున్నాడని ఆరోపించారు. అఖిల్ రెడ్డి మరే అమ్మాయిని మోసం చేయకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

YouTuber Komali : యువ యూట్యూబ్ కోమలి ఆత్మహత్య.. చిత్రపురి కాలనీలో విషాద ఛాయలు

మమ్మీ డాడీ నన్ను క్షమించండి.. ప్రేమ విఫలమై మరో విద్యార్థిని ఆత్మహత్య

Next Story