YouTuber Komali : యువ యూట్యూబ్ కోమలి ఆత్మహత్య.. చిత్రపురి కాలనీలో విషాద ఛాయలు

by Malleboina Mahesh |   (  Updated:2026-02-25 09:28:31  IST  )

యూట్యూబర్ కోమలి (21) మణికొండలో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ విఫలమవడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

YouTuber Komali : యువ యూట్యూబ్ కోమలి ఆత్మహత్య.. చిత్రపురి కాలనీలో విషాద ఛాయలు
X

దిశ, వెబ్‌డెస్క్: యువ యూట్యూబర్ కోమలి (YouTuber Komali) ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోవడం నగరంలో సంచలనంగా మారింది. గత కొంతకాలంగా మణికొండలోని చిత్రపురి కాలనీ లో నివసిస్తున్న కోమలి.. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సుమారు 24 గంటల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె, మంగళవారం చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఆత్మహత్యకు కారణాలు..

యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. గత మూడేళ్లుగా తనకు పరిచయం ఉన్న యూట్యూబర్ అఖిల్ రెడ్డితో ఆమె ప్రేమలో ఉన్నారని, అయితే ఏడాది క్రితం బ్రేకప్ అయిందని తెలుస్తోంది. అఖిల్ రెడ్డితో ప్రేమ విఫలం కావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. గతంలో కూడా ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు ఆమె ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె ఎవరితోనైనా మాట్లాడిందా, అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అఖిల్ రెడ్డి ప్రమేయంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Komali: తిరిగి వస్తే వదిలేయాలని తెలుసు.. కోమలి సూసైడ్ నోట్‌‍లో సంచలన విషయాలు

Next Story