- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మమ్మీ డాడీ నన్ను క్షమించండి.. ప్రేమ విఫలమై మరో విద్యార్థిని ఆత్మహత్య
విశాఖ పట్నానికి చెందిన రజిని అనే విద్యార్థిని ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంది. రజిని మధురవాడలోని ప్రైవేట్ కాలేజీలో ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్ చదువుతోంది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ప్రేమ విఫలమై యువతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల్లోనే ముగ్గురు యువతులు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించినవాడు మరో యువతికి దగ్గరయ్యాడని కోమలి ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు వనపర్తి జిల్లాకు చెందిన వసంత అనే విద్యార్థిని బాసర ట్రిపుల్ ఐటీ హాస్టల్ లో ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పినందుకు వసంత బావ ఆత్మహత్య చేసుకోగా.. భయంతో వసంత సైతం హాస్టల్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఇక తాజాగా ఏపీలో మరో ఘటన చోటు చేసుకుంది. విశాఖ పట్నానికి చెందిన రజిని అనే విద్యార్థిని ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంది. రజిని మధురవాడలోని ప్రైవేట్ కాలేజీలో ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే ప్రేమించిన వ్యక్తి తనను వదిలేశాడని, అతడిని వదిలి ఉండలేకపోతున్నా అంటూ సూసైడ్ నోట్ రాసి రజిని ఆత్మహత్య చేసుకుంది. అమ్మా.. నాన్న నన్ను క్షమించడండి అంటూ సూసైడ్ నోట్ రాసింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో రజిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.






