- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి పరిహారం
నిజామాబాద్ ఎన్కౌంటర్ వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రియాజ్ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం అందిస్తామని ప్రకటించారు.

X
దిశ, వెబ్ డెస్క్: నిజామాబాద్ ఎన్కౌంటర్ వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రియాజ్ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం అందిస్తామని ప్రకటించారు. అంతే కాకుండా కానిస్టేబుల్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు 300 గజాల ఇంటిస్థలం మంజూరు చేయిస్తామని, అతడి ఉద్యోగ విరమణ వరకు వచ్చే జీతాన్ని సైతం ఇస్తామని చెప్పారు. ప్రమోద్ కుటుంబానికి పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పోలీస్ భద్రత నిధి నుండి రూ.16 లక్షలతో పాటు పోలీస్ వెల్ఫేర్ నుండి మరో రూ.9 లక్షలు ఇస్తామని చెప్పారు.
Read More..
రౌడీ షీటర్ రియాజ్ ఎన్ కౌంటర్‌పై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి
Next Story






