రౌడీ షీటర్ రియాజ్ ఎన్ కౌంటర్‌పై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి

by Malleboina Mahesh |   (  Updated:2025-10-20 08:04:39  IST  )

రియాజ్ మృతిపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మీడియాతో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

రౌడీ షీటర్ రియాజ్ ఎన్ కౌంటర్‌పై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన రౌడీ షీటర్ షేక్ రియాజ్ (Rowdy sheeter Sheikh Riaz) ఈ రోజు మధ్యాహ్నం నిజామాబాద్ జీజీహెచ్ ఆస్పత్రి (Nizamabad GGH Hospital)లో ఎన్ కౌంటర్ (Encounter) చేశారు. కాగా రియాజ్ మృతిపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivdhar Reddy) మీడియాతో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్.. గది బయట కాపలా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. అనంతరం పోలీసులపై కాల్పులు (firing) జరిపేందుకు రియాజ్ ప్రయత్నించగా.. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు వారి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రౌడీ షీటర్ రియాజ్ ప్రాణాలు కోల్పోయాడని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక వేళ రియాజ్ కాల్పులు జరిపి ఉంటే ఆస్పత్రిలో ఉన్న చాలా మంది ప్రాణాలు పోయేవని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకే పోలీసులు వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారని డీజీపీ తెలిపారు. అయితే మొదట రియాజ్ కాల్పులు జరపగా ఏఆర్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా పోలీసులు నింధితునిపై కాల్పులు జరిపారని డీజీపీ తెలిపారు.

Next Story