- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రియాజ్ ఎన్ కౌంటర్.. అసలైన దీపావళి ఇవాళే కదా!?
పోలీసులు సంయమనంతో వ్యవహరించినా, నేరస్థుడు తన సహజ నేరప్రవృత్తిని మరిచిపోలేదు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పోలీసులు సంయమనంతో వ్యవహరించినా, నేరస్థుడు తన సహజ నేరప్రవృత్తిని మరిచిపోలేదు. ఫలితంగా ఇప్పటికే కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన కేసులో అరెస్టై పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు రియాజ్ సోమవారం మళ్లీ కానిస్టేబుల్ పై కాల్పులకు యత్నించాడు. నగరంలోని జీజీహెచ్ చికిత్స పొందుతున్న రియాజ్ సోమవారం ఉదయం వాష్ రూంకు వెళ్లి వస్తూ కానిస్టేబుల్ చేతిలో ఉన్న గన్ తీసుకుని పారిపోయే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
రియాజ్ జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్ కు గాయాలైనట్లు సమాచారం. హాస్పిటల్ లో వందల మంది ఇన్ పేషంట్స్, అవుట్ పేషంట్స్, ఆస్పత్రి సిబ్బంది ప్రాణాలు కూడా ప్రమాదంతో పడటంతో ఆత్మరక్షణ కోసం రియాజ్ పై పోలీసులు ఫైర్ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో రియాజ్ మృతి చెందినట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. సీపీ సాయి చైతన్య ఆస్పత్రికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీస్తున్నారు. ఐజీ చంద్రశేకర్ రెడ్డి కూడా నిజామాబాద్ కు రానున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
చాకూ కా జవాబ్.. గోలీ సే దియా..
కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ కేసు ఎపిసోడ్ లో పోలీసులు చాకూ కా జవాబ్.. గోలీ సే దియా.. అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మౌత్ కా బద్ లా మౌత్.. పోలీస్ నే ఓ కియా.. సహీ కియా.. అనే మాటలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో రియాజ్ చనిపోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రియాజ్ పట్ల పోలీసుల చర్యను సాధారణ జనం అంతా సమర్థిస్తున్నారు. చరిత్రలో నరకాసురుడిని వధించిన దీపావళి రోజునే యాధృచ్ఛికంగా ఓ కరడు గట్టిన నేరస్థుడిని పోలీసులు మట్టుబెట్టడం ఇక్కడ గమనార్హం.
ఎన్ కౌంటర్ తో ఎండ్ కార్డు..
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ కేసును పోలీసులు ఎన్ కౌంటర్ తో ముగించారు. పలు నేరాల్లో నిందితుడైన షేక్ రియాజ్ ను సీసీఎస్ పోలీసులు ఈనెల 17 న అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకొస్తుండగా వినాయక్ నగర్ ప్రాంతంలో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కానిస్టేబుల్ పై నిందితుడు రియాజ్ కత్తితో దాడి జరిపాడు. కత్తితో ప్రమోద్ ఛాతీపై బలంగా పొడిచి గాయపరిచి పారిపోయాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందిన విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు తీవ్ర స్థాయిలో స్పందించారు. 8 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రియాజ్ ను పట్టుకున్నారు.
రియాజ్ ను పట్టుకునే క్రమంలో కూడా ఓ స్థానిక పౌరుడు సయ్యద్ ఆసిఫ్ అనే యువకుడిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఆ వ్యక్తి కూడా ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నరనరాన నేర ప్రవృత్తిని అలవర్చుకున్న రియాజ్ సోమవారం పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మరో సారి ప్రయత్నించాడు. ఆస్పత్రి వద్ద సెక్‌యూరిటీగా ఉన్న కానిస్టేబుల్ గన్ లాక్కుని కాల్పులకు తెగబడటంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు రియాజ్ ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. రియాజ్ అరెస్టయి గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) చికిత్స పొందుతుండగా అసలేం జరిగిందనే వివరాలను పోలీసులు వెల్లడించిన తరువాతే అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.
Read More..
రౌడీ షీటర్ రియాజ్ ఎన్ కౌంటర్‌పై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి






