9 డిమాండ్లతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు. ..

9 డిమాండ్లతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ
X

దిశ‌, ఏపీ బ్యూరో: రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు. రైతుల ఆవేదనను చూసి తీవ్ర ఆందోళనతో ఈ లేఖ రాస్తున్నానని పేర్కొన్న ఆమె, రాష్ట్రానికి చెందిన ఎంపీలతో కలిసి పార్లమెంట్ వేదికగా రైతుల సమస్యలపై చర్చ చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరారు. రాష్ట్రంలో ఆక్వా, పొగాకు, మొక్కజొన్న, మామిడి, ఉల్లి, టమాటా తదితర పంటల రైతులు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని షర్మిల పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతులకు ఉపశమనం కల్పించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్లు

  • రాష్ట్రంలోని 30 లక్షల మంది ఆక్వా రైతుల మనుగడ, ఎగుమతుల అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలి.
  • రొయ్యల మేతపై టన్నుకు పడుతున్న అదనపు రూ.30 వేల భారాన్ని తగ్గించేందుకు రూ.100 కోట్ల కార్పస్ ఫండ్‌ను కేంద్రం వెంటనే మంజూరు చేయాలి.
  • రాష్ట్ర ఆక్వా ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న 30 శాతం దిగుమతి సుంకాలను రద్దు చేయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.
  • పొగాకు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా పార్లమెంట్‌లో చర్చ జరగాలి.
  • రైతుల వద్ద నిల్వ ఉన్న 230 మిలియన్ కిలోల పొగాకును కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
  • మొక్కజొన్నతో పాటు ఇతర పంటల గిట్టుబాటు ధరలో ఏర్పడుతున్న వ్యత్యాసాన్ని కేంద్రం పూర్తిగా భరించాలి.
  • రాష్ట్ర రైతులు పండించిన మామిడి పంటలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించి కొనుగోళ్లకు హామీ ఇవ్వాలి.
  • ఉల్లి, టమాటా తదితర ఉద్యాన పంటలకు ధరల పతనం వల్ల రైతులకు నష్టం కలగకుండా ప్రత్యేక నిధిని కేంద్రం ఏర్పాటు చేయాలి.
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కూటమిలో భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతులకు జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలి.
Next Story