Ranga Reddy collector : రంగారెడ్డి జిల్లా కొత్త కలెక్టర్‌గా హరీష్‌

by Sridhar Babu |
Ranga Reddy collector : రంగారెడ్డి జిల్లా కొత్త కలెక్టర్‌గా హరీష్‌
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : సుదీర్ఘకాలంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పని చేసిన డి.అమయ్‌ కుమార్‌ మేడ్చల్‌కు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో కొత్తగా ఇప్పటి వరకు మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌గా పని చేసిన హరీష్‌ వచ్చారు. గ్రూప్‌–1 కేడర్‌కు చెందిన ఈయన గతంలో ఇదే (ఉమ్మడి) జిల్లాలో జాయింట్‌ కలెక్ట ర్‌గా పని చేశారు. కొంతకాలం పాటు ఇంఛార్జి కలెక్టర్‌గా పని చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన అమయ్‌కుమార్‌ భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 1,02,575 దరఖాస్తులకు పరిష్కార మార్గం చూపించారు. ధరణి సమస్యల పరిష్కారంలో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచారు. సమీకృత జిల్లా అధికారుల సముదాయం (కలెక్టరేట్‌) భవనం పనుల పర్యవేక్షణ, ప్రారంభోత్సవంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు. పరిశ్రమలు, ఇతర ప్రభుత్వ అవసరాలకు భూముల సేకరణ విషయం లో ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వలేదు. ప్రస్తుతం మేడ్చల్‌ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాకు బదిలీపై వస్తున్న హరీష్‌కు సైతం జిల్లాపై పూర్తి పట్టు ఉంది. రెవెన్యూ అంశాలపై ఆయనకు మంచి పట్టు ఉండటం జిల్లాకు కలిసి వచ్చే అంశం. అయితే ఆయన ముందు కొన్ని సవాళ్లు కూడా లేకపోలేదు. యాచారం ఫార్మాసిటీ భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపు, నిషేధిత జాబితా లో ఉన్న పట్టా భూములు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, వంటి అంశాలు ఆయనకు పెద్ద సవాల్‌గా నిలువనున్నాయి.

Read more:

Hanumakonda District Collector : హ‌న్మ‌కొండ జిల్లా క‌లెక్ట‌ర్‌గా సిక్తా ప‌ట్నానాయ‌క్‌

Nizamabad Collector : నిజామాబాద్ కొత్త కలెక్టర్ గా రాజీవ్ గాంధీ హనుమంతు

Next Story

Most Viewed