Hanumakonda District Collector : హ‌న్మ‌కొండ జిల్లా క‌లెక్ట‌ర్‌గా సిక్తా ప‌ట్నానాయ‌క్‌

by Javid Pasha |   (  Updated:2023-01-31 15:15:57  IST  )

హ‌న్మ‌కొండ జిల్లా క‌లెక్ట‌ర్‌గా సిక్తా ప‌ట్నాయ‌క్ నియ‌మితుల‌య్యారు.

Hanumakonda District Collector : హ‌న్మ‌కొండ జిల్లా క‌లెక్ట‌ర్‌గా సిక్తా ప‌ట్నానాయ‌క్‌
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : హ‌న్మ‌కొండ జిల్లా క‌లెక్ట‌ర్‌గా సిక్తా ప‌ట్నాయ‌క్ నియ‌మితుల‌య్యారు. రాష్ట్ర వ్యాప్త ఐఏఎస్‌ల బ‌దిలీల్లో భాగంగా ఇక్క‌డ ప‌నిచేస్తున్న క‌లెక్ట‌ర్ రాజీవ్‌గాంధీ హ‌న్మంతును నిజామాబాద్‌కు బ‌దిలీ చేశారు. ఆదిలాబాద్ క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న సిక్తా ప‌ట్నానాయ‌క్‌ను హ‌న్మ‌కొండ‌కు బ‌దిలీచేశారు. ఓడిషా రాష్ట్రానికి చెందిన సిక్తా ప‌ట్నానాయ‌క్ 1987లో జ‌న్మించారు. 2014లో ఐఏఎస్ స‌ర్వీసుల్లోకి వ‌చ్చిన ఆమె పెద్ద‌ప‌ల్లి, ఆదిలాబాద్ క‌లెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం ఆదిలాబాద్ నుంచి హ‌న్మ‌కొండ‌కు బ‌దిలీపై వ‌చ్చారు. రెండు రోజుల్లో ఆమె హ‌న్మ‌కొండ క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టనున్న‌ట్లుగా స‌మాచారం.

Read more:

Nizamabad Collector : నిజామాబాద్ కొత్త కలెక్టర్ గా రాజీవ్ గాంధీ హనుమంతు

Next Story