Nizamabad Collector : నిజామాబాద్ కొత్త కలెక్టర్ గా రాజీవ్ గాంధీ హనుమంతు

by Disha Web Desk 15 |
Nizamabad Collector : నిజామాబాద్ కొత్త కలెక్టర్ గా రాజీవ్ గాంధీ హనుమంతు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కొత్త కలెక్టర్ గా రాజీవ్ గాంధీ హనుమంతు నియమితులయ్యారు. నిజామాబాద్ కలెక్టర్ గా పనిచేస్తున్న సి. నారాయణరెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. మంగళవారం రాత్రి సీనియర్ ఐఏఎస్ లు, జిల్లా కలెక్టర్ల బదిలీలు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 2012 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన రాజీవ్ గాంధీ హనుమంతు ప్రస్తుత కలెక్టర్​ నారాయణరెడ్డి కంటే సీనియర్. నారాయణ రెడ్డి నిజామాబాద్ కలెక్టర్ గా ఇటీవల మూడు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో నారాయణరెడ్డి పాలనపరంగా తనదైన ముద్ర వేసుకున్నారు. అన్ని పార్టీల నాయకులతో ప్రజాప్రతినిధులతో సఖ్యతతో మెదిలి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.

READ MORE

Ranga Reddy collector : రంగారెడ్డి జిల్లా కొత్త కలెక్టర్‌గా హరీష్‌

Next Story

Most Viewed