దేవాలయం భూముల పరిరక్షణకు కఠిన చర్యలు : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

by Batti.Sumithra |

దక్షిణాది తిరుపతిగా పేరుగాంచిన అల్వాల్ శ్రీ బాలాజీ ఆలయానికి రాజా కిషన్ ప్రసాద్ వందల ఎకరాల భూములు కేటాయించారని తెలంగాణ ఉద్యమకారుడు పి. సురేందర్ రెడ్డి తెలిపారు.

దేవాలయం భూముల పరిరక్షణకు కఠిన చర్యలు : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
X

దిశ, అల్వాల్ : దక్షణాది తిరుపతిగా పేరుగాంచిన టెంపుల్ అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామికి వందలు వేల ఎకరాల భూములు నాటి నిజాం ప్రభుత్వంలో ప్రధాన మంత్రిగా విధులు నిర్వహించిన రాజా కిషన్ ప్రసాద్ భూములు కేటాయించి దేవుని సేవకు ఉపయోగించాలని నిర్ణయించినట్లు ఆనాటి పెద్దలు తెలిపేవారని తెలంగాణ ఉద్యమ కారుడు పి.సురేందర్ రెడ్డి తెలిపారు. అంతటి మహాకార్యానికి ఉపయోగించవలసిన భూములు అన్యాక్రాంతం అయితే ఎలా చూసుకుంటు ఉంటామని తెలిపారు.

అందులో భాగంగానే ఇటీవల రథయాత్రకు వచ్చిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి దానికి సంభందించిన రికార్డులు దస్తావేజులు చూపెట్టడంతో పాటు రక్షణ కోసం దేవదాయ శాఖ ఉన్నత అధికారులకు తాను పెట్టిన వినతులను చూపెట్టారు. అక్రమార్కుల కన్నుపడి ముఖ్యంగా ఆలయం వెనుక భాగంలో ఉన్న విలువైన భూమిని కాజేయడానికి తగిన భూమిక తయారు చేసినట్లు సురేందర్ రెడ్డి ఎమ్మెల్యేకు వివరించారు. ఆలయ భూముల పరిరక్షణకు ఎమ్మెల్యే తగిన చర్యలు తీసుకుంటామని తెలపడం ఆనందదాయకం అన్నారు. దేవుని భూములు దేవుని సేవకే చెందాలని ఆక్రమణలకు గురికాకుండా చూస్తామని ఎమ్మెల్యే హామించినట్లు తెలిపారు.

Next Story