- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలయానికి చెందిన ఎద్దు మృతి.. ఇద్దరిపై కేసు నమోదు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని శివాజీ చౌక్ సమీపంలో ఉన్న శ్రీ లింగమయ్య ఆలయానికి చెందిన ఎద్దు (బొండా) మృతి చెందిన ఘటనలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దిశ, బాల్కొండ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని శివాజీ చౌక్ సమీపంలో ఉన్న శ్రీ లింగమయ్య ఆలయానికి చెందిన ఎద్దు (బొండా) మృతి చెందిన ఘటనలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాల్కొండ ఎస్సై శైలేందర్ తెలిపిన వివరాల ప్రకారం, ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన తోట శ్రీనివాస్, తేలు నర్సయ్య ఆదివారం ఎద్దును అపహరించేందుకు ప్రయత్నించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. శివాజీ చౌక్ సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాల వెనుక ప్రాంతంలో ఉన్న ఎద్దు మెడకు తాడు కట్టి లాగుతుండగా, తాడు ఉరిలా బిగుసుకోవడంతో అది అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతి చెందిన ఎద్దును గ్రామ శివారుకు తరలించి పశువైద్యుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం పూడ్చిపెట్టినట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాల్కొండ గ్రామానికి చెందిన కడ్తాల పెద్ద రాజేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.






