Kavitha: వెక్కి వెక్కి ఏడ్చినా కవితకు డిపాజిట్లు కూడా రావు..మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-01-06 07:08:53  IST  )

తెలంగాణలో త్వరలో కొత్త పార్టీ పెడతానని కవిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోంది.

Kavitha: వెక్కి వెక్కి ఏడ్చినా కవితకు డిపాజిట్లు కూడా రావు..మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వెక్కి వెక్కి ఏడ్చిన కవితకు డిపాజిట్లు కూడా రావని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత రాములు నాయక్ విమర్శించారు. కవిత పోరాటం ఆత్మగౌరవం కోసమా ఆస్తుల కోసమా అనేది నార్కో టెస్ట్ నిర్వహిస్తే బహిర్గతం అవుతుందన్నారు. గతంలో బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాములు నాయక్ తాజాగా శాసనమండలిలో కవిత కంటతడి పెట్టిన అంశంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 1200 మంది అమరవీరుల ఆత్మలు కేసీఆర్ కుటుంబాన్ని వెంటాడుతున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. జాగృతి పేరుతో కవిత ఫ్రాండ్ చేసిందని, జాగృతి మొదలు పెట్టిన సమయంలో కేసీఆర్ ఆదేశాలతో నేను కవితకు ఎంతో సపోర్టు చేస్తే నాకు రావాల్సిన టికెట్ కవిత రూ.25 లక్షలకు ఓ టీచర్ కు అమ్ముకుంటే ఆ రోజు నేను నా కుటుంబం ఏడ్చిన ఏడ్పు కవితకు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో కవితకు ప్రజలెవరూ గుర్తుకురాలేదని అధికారం పోయాక ఇప్పుడు ఉద్యమకారులు, సింగరేణి కార్మికులు, నేరేళ్ల బాధితులు, జీహెచ్ఎంసీ కార్మికులు అందరూ గుర్తుకు వస్తున్నారని విమర్శించారు. ప్రొఫెసర్ జయశంకర్ ను మెడలు పట్టి గెంటేసిన విషయం కవితకు తెలియదా అప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.

అప్పుడు రాని ఏడ్పు ఇప్పుడు ఎందుకు?:

తానెప్పుడు టికెట్లు అడగలేదని పార్టీనే నన్ను నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారని కవిత చేసిన వ్యాఖ్యలను రాములు నాయక్ ఖండించారు. తన తల్లితో కేసీఆర్ పై తీవ్రమైన ఒత్తిడి చేయించి నిజామాబాద్ టికెట్ తీసుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరంలో వచ్చిన డబ్బులు వచ్చినన్నాళ్లు మాట్లాడలేదు. కవిత భర్త ఏం వ్యాపారం చేస్తాడు? కవిత మామ ఏం చేసేవాడు? వీళ్ల చరిత్ర అందరికి తెలుసు. జూబ్లీహిల్స్ లో రోడ్డు నంబర్ 14 లో అంత పెద్ద భవనం ఎలా కట్టారు అని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘానికి అడ్వైజరీగా ఉన్న కవిత పరీక్షా పత్రాలు లీక్ చేసి రూ.15 లక్షలు ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కవితదన్నారు. పదవి కాలం అంతా పూర్తి చేసుకుని ఇప్పుడు వచ్చి ఆత్మగౌరవ పోరాటం అంటే ఎవరు నమ్మరన్నారు.

మళ్లీ బ్లాక్ మెయిల్ చేసేందుకే:

హరీశ్ రావు కంపెనీలో ఎవరెవరు పార్ట్నర్లుగా ఉన్నారో కవితకు తెలియదా? ఈటల రాజేందర్‍ను నన్ను ఎలాంటి షోకాజ్ నోటీసు లేకుండా బయటకు పంపినప్పుడు కవితకు ఎందుకు ఏడ్పురాలేదని నిలదీశారు. ఏదనా పార్టీతో పొత్తుపెట్టుకుని ఐదారు సీట్లు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టి మళ్లీ తన కుటుంబ సభ్యులను బ్లాక్ మెయిల్ చేసేందుకే కవిత ఏడ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబానికి కవితకు ఏమి లేనప్పుడు ఆర్థికంగా సహకరించిన తమలాంటి వారినందరిని దూరం పెట్టారని ఇప్పుడు నాది, ఉద్యమకారుల ఉసురు కేసీఆర్ కుటుంబానికి తగిలిందన్నారు. మీ వద్ద డబ్బులు ఉండవచ్చు. డబ్బులు ఉన్నంత మాత్రనా అన్ని జరిగిపోవన్నారు.

ఏడాది పాటు కుటుంబంలో గొడవ:

కేసీఆర్ సతీమణికి కేటీఆర్ సీఎం కావాలని ఉందని ఈ విషయంలో వారి కుటుంబంలో సంవత్సరం పాటు కొట్లాట జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందువల్లే కొత్త సెక్రటేరియట్ కట్టించారని ఎన్నికల్లో పార్టీ గెలిస్తే కేటీఆర్ ను సీఎం చేసి కేసీఆర్ జాతీయరాజకీయాల్లోకి పోవాలనేది వీళ్ల ప్రణాళిక అన్నారు. ఈడీ, సీబీఐలతో మూడేళ్లపాటు ఒంటరిగా పోరాటం చేశానని కవిత అంటున్నారు ఆమె ఏమైనా స్వాంత్యంత్రం కోసం పోరాడి జైలుకు వెళ్లిందా? లిక్కర్ స్కామ్‍లో జైలుకు వెళ్లిందని విమర్శించారు. బంజారాహిల్స్ లోని 'టానిక్' షాప్ లో కవిత వాటా అడిగితే వాటాకు బదులు సంతోష్ రావు ఢిల్లీ స్థాయిలో లిక్కర్ వ్యాపారంలోకి కవితను పంపి ఆమె జైలుకు వెళ్లేలా చేసింది సంతోష్ రావు అని ఆరోపించారు. కవిత అరెస్టు అయినప్పుడు హరీశ్ రావు, కేటీఆర్, పార్టీ పని చేసి బెయిల్‍పై బయటకు తీసుకువచ్చారన్నారు. ఏ గోల్డ్ షాప్ కు వెళ్లిన కేసీఆర్ పేరు చెప్పి బంగారం, నెక్లెస్‍లు తెచ్చుకున్న చరిత్ర కవితదన్నారు.


Read More..

ఉగాది నాటికి కవిత కొత్త పార్టీ అవిర్భావం.. నేడు ‘జాగృతి’ కీలక సమావేశం

కాసేపట్లో BRS సమాంతర అసెంబ్లీ సమావేశం.. హాజరుకానున్న కేటీఆర్, హరీశ్‌రావు

Next Story