- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగాది నాటికి కవిత కొత్త పార్టీ అవిర్భావం.. నేడు ‘జాగృతి’ కీలక సమావేశం
తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు బీజం పడింది. త్వరలో మరో కొత్త పార్టీ ఏర్పాటు కానుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు బీజం పడింది. త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు కానుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీతోనే పోటీ చేయనున్నట్లు ఆమె సోమవారం వెల్లడించారు. శాసనమండలి, తెలంగాణ అమరవీరుల స్థూపం (గన్‌పార్క్)వద్ద ఆమె చేసిన ప్రసంగం ఈ విషయాన్ని స్పష్టతను ఇచ్చాయి. ఇన్నాళ్లు కొత్త రాజకీయ పార్టీ ఉంటుందా లేక జాగృతితోనే నడిపిస్తారా అనేక సందేహాలు ఉన్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లుగా కూడా ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరో రాజకీయ పార్టీ పోటీలో ఉండనుంది. శాసనమండలిలో భావోద్వేగంతో ప్రసంగించిన పలు సంచలన విషయాలు వెల్లడించారు. తన భవిష్యత్కార్యాచరణ ప్రకటించే దిశగా నేడు జాగృతి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలను వారికి వివరిస్తారు. ఆ తర్వాత భవిష్యత్కార్యాచరణ ఏ విధంగా ఉంటే బాగుంటుందనే విషయాన్ని వారి ద్వారా సేకరించనున్నారు. ఈ మీటింగ్‌లో క్యాడర్ సలహాలు తీసుకుంటారు. వారి అభిప్రాయాలు సేకరించి వాటన్నింటిని క్రోడికరించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ జాగృతి నాయకులు ప్రకటించారు.
జిల్లాల పర్యటనలు రద్దు..
అత్యవసర సమావేశం నేపథ్యంలో కవిత తన జిల్లాల పర్యటనలను వాయిదా వేసుకున్నారు. వాస్తవంగా మంగళవారం ఆమె సిరిసిల్ల జిల్లాలో పర్యటించాల్సి ఉంది. తన అన్న కేటీఆర్ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కవిత పర్యటన నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. జాగృతి అత్యవసర సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులందరిని, అనుబంధ సంఘాలు, జిల్లా అధ్యక్షులు పార్టీకి చెందిన కమిటీల వారందరిని ఆహ్వానించారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరించి వారి ఆలోచనలు, అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లనున్నారు. జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే పార్టీ నాయకులందరు డిమాండ్చేస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలంటే, అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే, బీఆర్ఎస్, కాంగ్రెస్‌పార్టీ సాధించలేని లక్ష్యాలను సాధించాలంటే రాజకీయ పార్టీ ద్వారానే సాధ్యమవుతాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రజల ఆశీర్వాదాన్ని కోరనున్నారు.
పార్టీ పేరుపై భిన్నాభిప్రాయాలు..
మరోవైపు జాగృతిని పార్టీగా ఏర్పాటు చేయడం, అదే సమయంలో జాగృతిని కొనసాగించడమా? బంద్ చేయడమా అనే దానిపై కూడా అభిప్రాయాలు సేకరిస్తారు. ఇప్పటికిప్పుడు రాజకీయ పార్టీని ఏర్పాటు చేయవద్దని, రెండున్నర సంవత్సరాల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తానని చెప్పినందున చాలా సమయం ఉన్నందున వెంటనే పార్టీ ఏర్పాటు ఉండదని, మరికొంత సమయం తీసుకుంటారని చెబుతున్నారు. తెలంగాణ జాగృతి పేరుతోనే పార్టీని ఏర్పాటు చేయాలని చాలా మంది సూచిస్తున్నారని, మరికొందరు టీఆర్ఎస్అనే పేరు వచ్చే విధంగా పార్టీ పేరు ఉండాలని ఆ విధంగా రూపకల్పన చేయాలని కోరినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత జిల్లాల్లో పర్యటించినప్పుడు పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తల నుంచి రకరకాల అభిప్రాయాలు చెప్పారని, వాటన్నింటిని క్రోడికరించి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటారని, రాజకీయ పార్టీకి ఆవిర్భావం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. త్వరలోనే కొత్త పార్టీ పురుడు పోసుకోవడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీ పెట్టడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందనే విషయంపై స్పష్టత లేదని అంటున్నారు.
కవితపై బీఆర్ఎస్ శ్రేణుల ట్రోల్స్..
టీఆర్ఎస్‌ను భారత రాష్ట్ర సమితి మార్చడాన్ని తాను వ్యతిరేకించానని శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె ద్వంద విధానాలను ప్రశ్నిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో టీఆర్‌ఎస్‌పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చినప్పుడు కవిత ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ జాగృతిని ఆమె భారత జాగృతిగా మార్చారు. భారత జాగృతి పేరుతో పలు కార్యక్రమాలను కూడా ఆమె నిర్వహించారు. భారత జాగృతి పేరుతో దేశ వ్యాప్తంగా తమ కార్యకలాపాలు చేపడుతామని ఆమె ప్రకటించారు. అయితే ఆ తర్వాత మారిన ఆమె వైఖరి నేపథ్యంలో తెలంగాణలో తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇతర రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాలను మాత్రం భారత జాగృతి పేరుతో నిర్వహిస్తామని ప్రకటించారు. తాజాగా భారత రాష్ట్ర సమితినే తాను వ్యతిరేకించానని ఆమె మాట్లాడుతున్నారు. బీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించానంటూ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కవిత వ్యాఖ్యలతో పార్టీలో చర్చ మొదలైంది. పార్టీ పేరును 2022 డిసెంబర్9న కవిత తన సోషల్‌మీడియా అకౌంట్‌లో జననేతకు జయహారతి, న్యూ స్టార్ట్, న్యూ మిషన్బై ద లీడర్ విత్ఏ విజన్, కేసీఆర్‌గారు విజయీభవ, జై భారత్జై తెలంగాణ అని రాసి కేసీఆర్ఫోటోను కవిత షేర్చేశారు. దీనిపై గులాబీ పార్టీ శ్రేణులు కవిత ఎక్స్‌లో చేసిన క్లిప్పును ఇప్పుడు షేర్చేస్తూ ప్రశ్నిస్తున్నారు. గత ఏప్రిల్‌లో పార్టీ ఆవిర్భావ సభ జరిగినప్పుటి నుంచి బహిరంగంగా మొదలైన వివాదం కాస్తా చిలికి చిలికి గాలి వానగా మారి పార్టీ నుంచి సస్పెండ్అయ్యారు. ఆ తర్వాత నుంచి బీఆర్‌ఎస్‌పై కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ కూతురుగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు, రాజకీయ పార్టీల నేతల్లో చర్చనీయాంశమయ్యాయి. బీఆర్‌ఎస్‌కు ఇరకాటంగా మారాయి. బీఆర్ఎస్‌లో ప్రధానంగా హరీశ్‌రావును టార్గెట్‌గా ఆమె ఆరోపణలు సాగుతున్నాయి. వీటన్నింటిని అధికార కాంగ్రెస్అస్త్రంగా మలుచుకుంటుంది. సొంత ఆడబిడ్డనే చెబుతుంది అంటూ బీఆర్‌ఎస్‌ను మరింత ఇరకాటంలోకి నెడుతున్నారు. బీఆర్ఎస్పార్టీ నాయకులు కవితపై స్పందించడానికి వెనకాముందు ఆడుతున్నారు. ఆమెపై మాట్లాడేందుకు అనుమతులు లేనందున జిల్లాకు ఒకరిద్దరు తప్ప మిగతా వారెవ్వరూ స్పందించడలేదని తెలిసింది.
Read More..
కాసేపట్లో BRS సమాంతర అసెంబ్లీ సమావేశం.. హాజరుకానున్న కేటీఆర్, హరీశ్‌రావు






