కాసేపట్లో BRS సమాంతర అసెంబ్లీ సమావేశం.. హాజరుకానున్న కేటీఆర్, హరీశ్‌రావు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-06 04:31:58  IST  )

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌‌లో ఇవాళ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ‘సమాంతర అసెంబ్లీ’‌ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

కాసేపట్లో BRS సమాంతర అసెంబ్లీ సమావేశం.. హాజరుకానున్న కేటీఆర్, హరీశ్‌రావు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో ఇవాళ బీఆర్‌ఎస్ (BRS) పార్టీ ఆధ్వర్యంలో ‘సమాంతర అసెంబ్లీ’ (Mock Assembly) సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో విపక్షాలకు తగిన సమయం ఇవ్వడం లేదని, ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం కల్పించడం లేదని నిరసిస్తూ బీఆర్‌ఎస్ అసెంబ్లీని బైకాట్ చేసి ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మాక్ అసెంబ్లీలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం అందజేయడంలో జరుగుతున్న ఆలస్యం, రుణమాఫీ ప్రక్రియలో ఉన్న గందరగోళం, అర్హులైన వారందరికీ అందకపోవడం, రాష్ట్రంలోని ఇతర పెండింగ్ సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమాంతర అసెంబ్లీ సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హారుకానున్నారు. అసెంబ్లీ తరహాలోనే స్పీకర్‌ను నియమించుకుని, ప్రశ్నలు-సమాధానాలు, చర్చల రూపంలో ఈ కార్యక్రమం సాగనుంది. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని ప్రజలకు చాటిచెప్పడమే సమాంతర అసెంబ్లీ ప్రధాన ఉద్దేశమని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి.

Read More..

ఉగాది నాటికి కవిత కొత్త పార్టీ అవిర్భావం.. నేడు ‘జాగృతి’ కీలక సమావేశం

Next Story