- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఆర్ఎస్‌ను గెలిపిస్తే ఉచిత వైద్యం, విద్య ఇచ్చి చూపిస్త: కవిత
తెలంగాణ రక్షణసేన పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత కోరుట్లలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌కు అధికారం ఇస్తే ఎంతపెద్ద రోగం వచ్చినా, ఎంత బిల్ అయినా కుటుంబంలో ప్రతిఒక్కరికీ ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తుందని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రక్షణసేన పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత కోరుట్లలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌కు అధికారం ఇస్తే ఎంతపెద్ద రోగం వచ్చినా, ఎంత బిల్ అయినా కుటుంబంలో ప్రతిఒక్కరికీ ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తుందని అన్నారు. తాను ఈ మాట చెప్పిన వెంటనే అన్ని పార్టీలలోని అన్నలు, తండ్రులు తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఉన్న బడ్జెట్ తో అది సాధ్యం కాదని, డబ్బులు ఎక్కడ నుండి ఇస్తావని అంటున్నారని చెప్పారు.
నాయకులు అవినీతి సొమ్ము తినడం మానేస్తే పేదవాళ్లకు ఉచిత విద్య, వైద్యం అందుతాయని అన్నారు. ఇప్పుడున్న బడ్జెట్ తోనే ఉచిత వైద్యం, విద్య అందించవచ్చని లెక్కలతో సహా చెబుతానని వ్యాఖ్యానించారు. తన తల్లి పట్టుబట్టి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివించిందని, ఆమె దయతో అమెరికా వరకు వెళ్లి చదువుకున్నానని తెలిపారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే అదే తెలివితే విద్య, వైద్యం అందించి చూపిస్తానని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ అవసరమైన పనులు చేసిపెడితే మరో పార్టీ పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుందన్నారు. అవినీతి అన్యాయం జరుగుతున్నాయని చెప్పినందుకే బీఆర్ఎస్ తనను బయటకు గెంటేసిందన్నారు. ప్రజా ఉద్యమాలు చేసినందుకే తనను బయటకు పంపించారని తెలిపారు.






