యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

by Sridhar Babu |

దిశ,యాదగిరిగుట్ట : వేసవి సెలవులు అయిపోతుండటంతో యాదాద్రికి తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువ జామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవ అనంతరం స్వయంభు, ప్రతిష్ట అలంకాలమూర్తులకు నిజాభిషేకం, తులసి దళాలతో అర్చన, సాయంత్రం శ్రీ స్వామి అమ్మవారి సేవలను ప్రధానాలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఉదయం నుంచి స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూ కాంప్లెక్స్ లో దర్శనానికి నిరీక్షించారు. స్వామి వారి ధర్మ దర్శనానికి

మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామివారి కళ్యాణం చేయించి భక్తులు ముక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల వద్ద కూడా భక్తులు బార్లు తీరారు. స్వామి వారి కొండపైన భక్తుల రద్దీ ఉండడంతో వాహనాల ప్రవేశం ప్రతి పది నిమిషాలకు ఒకసారి కార్లను కొండపైకి పంపకుండా ఆపివేశారు. కొండపైన తగినంత పార్కింగ్ సదుపాయం లేనందున ఆపివేస్తున్నామని భక్తులకు విజ్ఞప్తి చేశారు. అలాగే కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో వ్రతాలు చేయించుకున్నారు. వివిధ పూజల ద్వారా స్వామివారి నిత్యాదాయం రూ:62,55,860 సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed