నాన్న సినిమా చూస్తూ.. అకీరా ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Jakkula Samataha |
నాన్న సినిమా చూస్తూ.. అకీరా ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, సినిమా : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అకీరా పేరే వినిపిస్తుంది. పిఠాపురం నుంచి గెలిచినప్పటి నుంచి అకీరా పవన్ తోనే ఉంటున్నారు. దీంతో ఆయనకు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు మూవీ రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ మూవీని అకీరా థియేటర్‌కు వెళ్లి వీక్షించారు. దీంతో థియేటర్ వద్ద అభిమానుల సందడి మాములుగా లేదు. జూనియర్ పవర్ స్టార్ అంటూ తెగ హంగామా చేశారు. అయితే తన తండ్రి మూవీని చూస్తూ అకీరా చాలా ఎంజాయ్ చేశారు. అంతే కాకుండా మూవీలో కొన్ని డైలాగ్స్ వచ్చినప్పుడు అకీరా ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్‌కు చాలా మంది షాక్ అయ్యారు. అచ్చం పవన్ కళ్యాణ్‌లానే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తున్నాడు, త్వరలో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తే బాగుండు అంటూ ముచ్చటిస్తున్నారు పవన్ అభిమానులు. కాగా, ప్రస్తుతం అకీరా తమ్ముడు మూవీ చూసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.Next Story

Most Viewed