- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం.. BRS, BJP పిటిషన్లపై విచారణ ఆగస్టు 12కు వాయిదా
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారణ చేపట్టింది. ఈ మేరకు కేసులో తదుపరి విచారణను ఆగస్ట్ 12కు వాయిదా వేస్తున్నట్లుగా ధర్మాసనం వెల్లడించింది. ఈ మేరకు విచారణ సందర్భంగా బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాలకు సంబంధించిన రికార్డులను స్పీకర్ కార్యాలయం ఇప్పటివరకు తమకు సమర్పించలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, దీనిపై రియాక్ట్ అయిన స్పీకర్ ట్రైబ్యునల్ తరఫు న్యాయవాది, సదరు నిర్ణయాల రికార్డులను కోర్టుకు సమర్పించేందుకు తమకు మరికొంత సమయం కావాలని రిక్వెస్ట్ చేశారు. ఇరువైపుల పక్షాల వాదనలను విన్న కోర్టు.. రికార్డులు దాఖలు చేయడానికి స్పీకర్ ట్రైబ్యునల్‌కు గడువు మంజూరు చేస్తూ, తదుపరి విచారణను ఆగస్ట్ 12కు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది.






