- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హజ్-2027 యాత్ర.. మంత్రి ఎన్ఎండి ఫరూక్ కీలక పిలుపు
పవిత్ర మక్కా యాత్ర హజ్ -2027కు దరఖాస్తు చేసుకునేందుకు గడువు శుక్రవారంతో ముగియనుందని, కేంద్ర హజ్ కమిటీ పెంచిన నాలుగు రోజుల గడువు శుక్రవారం (24వ తేది) అర్ధరాత్రికి ముగుస్తుండడంతో హజ్ యాత్ర చేయాలనుకునే వారు గడువు ముగిసేలోగా దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ,న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ విజ్ఞప్తి చేశారు..

దిశ, ఏపీ బ్యూరో: పవిత్ర మక్కా యాత్ర హజ్ -2027కు దరఖాస్తు చేసుకునేందుకు గడువు శుక్రవారంతో ముగియనుందని, కేంద్ర హజ్ కమిటీ పెంచిన నాలుగు రోజుల గడువు శుక్రవారం (24వ తేది) అర్ధరాత్రికి ముగుస్తుండడంతో హజ్ యాత్ర చేయాలనుకునే వారు గడువు ముగిసేలోగా దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ,న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ విజ్ఞప్తి చేశారు. హాజీలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో మంత్రి ఫరూక్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పవిత్ర మక్కా యాత్ర హజ్ -2027కు ఇప్పటివరకు (బుధవారం) 2421 మంది యాత్రికులు ఆన్ లైన్ ద్వారా తమ తమ పూర్తి వివరాలతో కేంద్ర హజ్ కమిటీకి దరఖాస్తు చేసుకోవడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.
ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన "షార్ట్ హజ్" ఆప్షన్ ద్వారా కుదించబడిన 20 రోజుల హజ్ యాత్ర కోసం 388 మంది హాజీలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం కు మొదటి ప్రాధాన్యత ఇచ్చే ప్రయాణికులందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న రూ.లక్ష ఆర్థిక సాయంకు విశేష స్పందన లభిస్తుందన్నారు. కేంద్ర హజ్ కమిటీ నిర్ణయం మేరకు పొడిగించబడిన హజ్ యాత్ర దరఖాస్తు గడువును మక్కా యాత్ర చేయాలనుకునే వారంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడువులోగా పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని, విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రంకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి కూటమి ప్రభుత్వం అందిస్తున్న రూ.లక్ష ఆర్థిక సాయం పొందాలని మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ విజ్ఞప్తి చేశారు.






