- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హామీలు ఇచ్చి.. ఉద్యోగాలు మరిచారు..
నిరుద్యోగ యువతీ, యువకులు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ యాప్‌ను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్‌ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : నిరుద్యోగ యువతీ, యువకులు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ యాప్‌ను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్‌ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని దివ్యాంగుల సహకార సంస్థ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండలో నిరుద్యోగుల కోసం రూపొందించిన ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ యాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరూరి రమేష్, మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, నాగుర్ల వెంకన్న, మర్రి యాదవ్ రెడ్డి, నేషనల్ మోటివేషన్ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్ర తదితరులు హాజరయ్యారు. అనంతరం కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా 50 కిలోల కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా అనేక ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పటికీ, వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. నిరుద్యోగుల పక్షాన బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకొని యువత తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణ అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ పెద్ద కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు.






