శాంసంగ్‌ ఫోల్డబుల్‌, ఫ్లిప్‌ ఫోన్లు రిలీజ్.. ధర, ఫీచ‌ర్స్ ఇవే

by velandi.Saikiran |

శాంసంగ్‌ ఫోల్డబుల్‌, ఫ్లిప్‌ ఫోన్లు రిలీజ్ చేశాయి.

శాంసంగ్‌ ఫోల్డబుల్‌, ఫ్లిప్‌ ఫోన్లు రిలీజ్.. ధర, ఫీచ‌ర్స్ ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్: శాంసంగ్ తన ఫోల్డబుల్, ఫ్లిప్ మొబైల్స్ ను తాజాగా మార్కెట్లోకి తీసుకొచ్చాయి. శాంసంగ్ అన్ క్యాప్డ్ ఈవెంట్ లో గెలాక్సీ జెడ్ 8, z8 ఆల్ట్రా, z ఫ్లిప్ 8 స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేసింది. వీటితో పాటు గెలాక్సీ వాచ్ అల్ట్రా, వాచ్ 9 రిలీజ్ చేసింది. ఇవాళ రాత్రి నుంచే ప్రీ ఆర్డర్స్ తీసుకోనున్నారు. లాంచ్ అయిన ఈ కొత్త మొబైల్స్ అన్నీ కూడా లక్షకు పైగానే ఉన్నాయి.

Samsung Galaxy Z Fold8 : 7.6 అంగుళాలతో ఈ Samsung Galaxy Z Fold8 మొబైల్ రానుంది. కవర్ స్క్రీన్ కు కార్నింగ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 3 ప్రొటెక్షన్ అందిస్తారు. 4800 amh బ్యాటరీ కూడా అందిస్తున్నారు. 45 W ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం 10 ఎంపీ కెమెరా రానుంది. ఈ ఫోన్ 201 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ రూ.1,79,999 నుంచి ప్రారంభం కానుంది.

Samsung Galaxy Z Fold8 Ultra: 6.5 అంగుళాల‌తో ఈ Samsung Galaxy Z Fold8 Ultra రానుంది. 200MP Main + 50MP Ultra-Wide + 10MP 3x కెమెరా వెనుక భాగంలో ఉండ‌నుండ‌గా, 10MP సెల్ఫీల కోసం ఇస్తున్నారు. 5,000mAh బ్యాట‌రీ అందిస్తున్నారు. ఈ ఫోన్ రూ.1,99,999 నుంచి ప్రారంభం కానుంది.

Samsung Galaxy Z Flip8 : శాంసంగ్ గెలాక్సీ Z Flip8 ఫోన్ 6.9 అంగుళాల‌ Displayతో మార్కెట్ లోకి రానుంది. వెనుక కెమెరా 50MP (OIS) + 12MP UW, సెల్ఫీల కోసం 10MP కెమెరా రానుంది. 4300mAh బ్యాట‌రీ అందించ‌నున్నారు. Android 17 & One UI 9 వెర్షన్ ఆధారంగా ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ రూ.1,24,999 నుంచి ప్రారంభం కానుంది.

Next Story