అరెస్టులతో విద్యార్థులను, రాహుల్ గాంధీని అడ్డుకోలేరు

by Batti.Sumithra |

అరెస్టులతో విద్యార్థులను, రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు.

అరెస్టులతో విద్యార్థులను, రాహుల్ గాంధీని అడ్డుకోలేరు
X

దిశ, చిన్నచింతకుంట : అరెస్టులతో విద్యార్థులను, రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని లాల్‌కోట ఎక్స్ రోడ్డులో, రాయిచూర్ హైవేపై దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి వ్యతిరేకంగా, ఢిల్లీలో విద్యార్థులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం, విద్యార్థులపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని నిరసిస్తూ భారీ ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం అమానుషమని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నీట్ పరీక్షల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ రెడ్డి, కిషన్, సురేందర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, దామోదర్ యాదవ్, శివకుమార్, శంసాన్, శ్రావణ్, జయరాజ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story