- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: జ్యుడిషియల్ ఆఫీసర్ల రిటైర్మెంట్ వయస్సుపై సుప్రీంకోర్టు కీలక సూచన
సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే, ఈ పెంపు 2026, ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా జిల్లా న్యాయవ్యవస్థలోని జ్యూడిషియల్ ఆఫీసర్ల (జిల్లా జడ్జీలు సహా) పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలన్న అంశంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం, 'అఖిల భారత న్యాయమూర్తుల సంఘం' దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుపుతూ, తుది నిర్ణయం వచ్చే వరకు తాత్కాలికంగా రిటైర్మెంట్ ఏజ్‌ను 61 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలించాలని అన్ని రాష్ట్రాలు, హైకోర్టులను ఆదేశించింది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే, ఈ పెంపు 2026, ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే ఇది తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. రెండు వారాల్లోగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, హైకోర్టులు తమ అభిప్రాయాలను అఫిడవిట్ల రూపంలో దాఖలు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపిన రాష్ట్రాలు, హైకోర్టులు సంక్షిప్త అంగీకార పత్రం సమర్పిస్తే సరిపోతుందని తెలిపింది. గతంలో శెట్టి కమిషన్ చేసిన 62 ఏళ్ల రిటైర్మెంట్ సిఫార్సును సుప్రీంకోర్టు తిరస్కరించినప్పటికీ, మధ్యప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో చోటుచేసుకున్న పరిణామాలు, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సులో వచ్చిన మార్పులు, వివిధ రాష్ట్రాల భిన్న అభిప్రాయాల నేపథ్యంలో ఈ అంశాన్ని మరోసారి సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.






