చింత్రియాలలో ఎన్టీఆర్ విగ్రహం, సిమెంట్ బెంచీల ధ్వంసం

by Ratna Kumari |

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింత్రియాల గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ విధ్వంసానికి పాల్పడిన ఘటన గ్రామంలో కలకలం రేపింది.

చింత్రియాలలో ఎన్టీఆర్ విగ్రహం, సిమెంట్ బెంచీల ధ్వంసం
X

దిశ, చింతలపాలెం : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింత్రియాల గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ విధ్వంసానికి పాల్పడిన ఘటన గ్రామంలో కలకలం రేపింది. గ్రామ అభివృద్ధిలో భాగంగా మాజీ సర్పంచ్ మొర్రిమేకల తిరుపతమ్మ ఏర్పాటు చేయించిన సిమెంట్ బెంచీలను ధ్వంసం చేయడంతో పాటు, గ్రామంలో ప్రతిష్ఠించిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహం బొటన వేలును కూడా ధ్వంసం చేసినట్లు స్థానికులు తెలిపారు.

ఉదయం ఈ ఘటనను గమనించిన గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు మహానేత ఎన్టీఆర్ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి పాల్పడడం బాధాకరమని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన వ్యక్తులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మాజీ సర్పంచ్ మొర్రిమేకల తిరుపతమ్మ చింతలపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించి, విధ్వంసానికి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Next Story