- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీర్‌పేట్ రౌడీ షీటర్ హత్య కేసు ఛేదన..
మీర్‌పేట్‌లో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మీర్‌పేట్ పోలీసులు తెలిపారు.

దిశ, మీర్‌పేట్: మీర్‌పేట్‌లో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మీర్‌పేట్ పోలీసులు తెలిపారు. మీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్ శోభన్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామానికి చెందిన దాసరి సురేందర్ అలియాస్ సూరి (41) హత్యకు గురయ్యాడు. నందనవనం ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వ్యక్తిగత కక్షలతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ అర్ఫాస్ (22)కు మృతుడు సూరితో గతంలో నుంచి వివాదాలు ఉన్నాయని తెలిపారు. అర్ఫాస్ సోదరి ఫాతిమాను సూరి గతంలో వివాహం చేసుకున్నాడని, కుటుంబ సంబంధిత విభేదాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులుగా మహమ్మద్ అర్ఫాస్ (22), సుహిద్రమణి స్వామి (19), జంగిలొల్ల నాని (19)లను గుర్తించారు. అర్ఫాస్ పంక్చర్ షాపులో పనిచేస్తుండగా, సుహిద్రమణి స్వామి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి 11:44 గంటల సమయంలో నందనవనం ప్రాంతంలో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు గాయాలతో ఉన్న సూరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, వారు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా, కోర్టు వారిని రిమాండ్‌కు తరలించింది. కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.






